టెన్షన్.. పన్నీర్ పళని గ్రూపుల మధ్య ఘర్షణ

చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాలు పరస్సరం రాళ్లు, కర్రలతో దాడులు దిగాయి.

Update: 2022-07-11 03:22 GMT

చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రెండు వర్గాలు పరస్సరం రాళ్లు, కర్రలతో దాడులు దిగాయి. దీంతో ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు పరస్పరం బాహాబాహీ తలపడ్డాయి. కొందరికి తీవ్ర గాయలయినట్లు తెలసింది. పోలీసులు భారీ ఎత్తున మొహరించినా పరిస్థితి అదుపు తప్పింది. రెండు వర్గాలు కర్రలతో దాడికి దిగడంతో పోలీసులు వారిపై స్పల్పంగా లాఠీ ఛార్జి చేసినట్లు తెలిసింది.

సర్వసభ్య సమావేశంలో....
ఈరోజు అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానుంది. న్యాయస్థానం సూచనల మేరకు ఈ సమావేశం జరుగుతుంది. వానగరం శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్ లో ఈ సమావేశం జరుగుతుంది. అయితే పన్నీర్ సెల్వంను శాశ్వతంగా పార్టీ నుంచి పంపించేందుకు పళనిస్వామి వర్గం ప్రయత్నిస్తుండటంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిసింద.ి సమావేశానికి సంబంధించి ఓపీఎస్ వర్గానికి ఐడీ కార్డులు మంజూరు కాకపోవడంతోనే ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News