Sabarimala : అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్

అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్ ఆలయ కమిటీ చెప్పింది

Update: 2025-09-30 07:21 GMT

అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్ ఆలయ కమిటీ చెప్పింది. ఇకపై అయ్యప్ప ప్రసాదం ఆన్ లైన్ లో పంపిణీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు ట్రావెన్ కోర్ ఆలయ బోర్డు స్పష్టం చేసింది. అయ్యప్ప స్వామి ప్రసాదం రుచిగానూ, ఎంతో శక్తినిచ్చేదిగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. శబరిమలకు వెళ్లి వచ్చిన వారి నుంచి అయ్యప్ప ప్రసాదాన్ని తీసుకునేందుకు పరితపిస్తుంటారు.

ప్రసాదం ఆన్ లైన్ లో...
ఇకపై అయ్యప్ప స్వామి వారి ప్రసాదం ఆన్ లైన్ లో లభిస్తుందని ట్రావెన్ కోర్ బోర్డు చెప్పడంతో భక్తుల ఆనందంగా ఫీలవుతున్నారు. శబరిమలకు వెళ్లలేని వారు కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ ఇచ్చి అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని పొందే వీలుంటుంది. శబరిమలకు వెళ్లలేని వారు కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించే అవకాశం ఆలయ కమిటీ కల్పించింది.


Tags:    

Similar News