మృతులకు టాటా గ్రూపు భారీ పరిహారం
అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో మరణించిన వారికి టాటా గ్రూప్ సంస్థ పరిహారం ప్రకటించింది
అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో మరణించిన వారికి టాటా గ్రూప్ సంస్థ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియో చెల్లిస్తామని టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. క్షతగాత్రులవైద్య ఖర్చులన్నీ భరిస్తామని తెలిపారు. బీజే మెడికల్ కళాశాలను పునర్నిస్తామని తెలిపారు.
విచారణ ప్రారంభం...
క్షతగాత్రులకు అండగా నిలబడతామని చంద్రశేఖరన్ తెలిపారు. కాగా విమానం ప్రమాదంపై విచారణ ప్రారంభమయింది. డీజీసీఏ తో పాటు స్థానిక పోలీసులు కూడా విచారణ ప్రారంభించారు. మరోవైపు విమాన ప్రమాద స్థలాన్ని పౌర విమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇది మహా విషాదమని ఆయన పేర్కొన్నారు.