జల్లికట్టుకు గ్రీన్ సిగ్నల్.. రేపటి నుండే పోటీలు

వీక్షకుల సంఖ్యను కూడా పరిమితం చేసింది ప్రభుత్వం మూడు వందలకు మించకుండా ఆంక్షలు విధించింది.

Update: 2023-01-07 11:44 GMT

jallikattu in tamilnadu

జల్లికట్టు.. తమిళనాడు పురాతన సంప్రదాయ క్రీడ. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఒక్కోసారి ఈ పోటీల్లో మనుషుల ప్రాణాలు కూడా పోతుంటాయి. అందుకే ఈ క్రీడను ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. తమిళ ప్రజల నుండి జల్లికట్టును మళ్లీ నిర్వహించాలని పెద్ద ఎత్తున విన్నపాలు రావడంతో తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. రేపటి నుండి జల్లికట్టు పోటీలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలతో కూడిన అనుమతినిచ్చింది.

తప్పని సరిగా కోవిడ్ వ్యాక్సినేషన్, నెగటివ్ సర్టిఫికేట్ లు ఉండాలని పేర్కొంది. అంతేకాదు వీక్షకుల సంఖ్యను కూడా పరిమితం చేసింది ప్రభుత్వం మూడు వందలకు మించకుండా ఆంక్షలు విధించింది. జల్లికట్టు నిర్వహించేవారు ఆ జిల్లా కలెక్టర్ నుండి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. నిజానికి జనవరి 1వ తేదీ నుండే జల్లికట్టు పోటీలు మొదలవ్వాలి కానీ.. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకూ పోటీలను వాయిదా వేశారు. తమిళనాడులో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించే జల్లికట్టు పోటీలకు ప్రాధాన్యత ఉంది. జనవరి 15న అవన్యాపురం, 16న పాలమేడు, 17న అలంగా నల్లూరులో పోటీలను నిర్వహించడానికి నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కనుమ రోజున చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు.








Tags:    

Similar News