బాణాసంచా కాలుస్తూ 89 మందికి గాయాలు
తమిళనాడులో బాణాసంచా కాలుస్తూ ఇప్పటి వరకూ ఇప్పటివరకు 89 మంది గాయపడ్డారు
తమిళనాడులో బాణాసంచా కాలుస్తూ ఇప్పటి వరకూ ఇప్పటివరకు 89 మంది గాయపడ్డారని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రహ్మణియన్ తెలిపారు. సోమవారం ఆయన కిల్పాక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో కాలిన గాయాల వార్డును పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. గాయపడిన వీరిలో 41 మందికి చికిత్స పూర్తయి వారు ఇంటికి వెళ్లారు. మరో 48 మందికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని మంత్రి తెలిపారు. గాయపడిన వారిలో 32 మందికి ప్రధాన శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు వివరించారు.
దీపావళి సందర్భంగా....
దీపావళి సందర్భంగా కాలిన గాయాల చికిత్సకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో కాలిన గాయాల కోసం 20 పడకలు అదనంగా ఏర్పాటు చేసినట్లు మంత్రి సుబ్రహ్మణియన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి బాణా సంచా కాల్చేసమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే ప్రమాదాల బారిన పడతారని చెబుతున్నారు.