Tamilnadu : మృతుల కుటుంబానికి విజయ్ పరిహారం ..ఎంతో తెలుసా?

తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ తన సభలో తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలకు భారీ పరిహారాన్ని ప్రకటించారు

Update: 2025-09-28 06:20 GMT

తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ తన సభలో తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలకు భారీ పరిహారాన్ని ప్రకటించారు. నిన్న కరూర్ రోడ్ లో జరిగిన సభలో తొక్కిసలాట ముప్ఫయి మంది మరణించిన నేపథ్యంలో విజయ్ ఈ పరిహారం ప్రకటించారు. ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల పరిహారాన్ని పార్టీ తరుపున ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే మృతులు ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల రూపాయలు ప్రకటించిన నేపథ్యంలో విజయ్ ఇరవై లక్షలు పరిహారాన్ని ప్రకటించారు.

గాయపడిన వారికి...
తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని పేర్కొంది. ఈ ఘటనలో వందలాది మంది గాయపడ్డారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల పరిహారాన్ని విజయ్ ప్రకటించారు. కాగా కరూర్ లో తొక్కిసలాట జరిగి ముప్ఫయి తొమ్మిది మంది మరణించిన కేసులో విజయ్ తో పాటు పార్టీ నేతలపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. దీనిపై ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది.


Tags:    

Similar News