Taminadu : నేటి నుంచి విజయ్ జిల్లాల పర్యటన

తమిళనాడులో తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ నేటి నుంచి జనంలోకి వెళ్లనున్నారు

Update: 2025-09-13 04:29 GMT

తమిళనాడులో తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ నేటి నుంచి జనంలోకి వెళ్లనున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు ఉండటంతో విజయ్ నేటి నుంచి తొలి విడత యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాల్లో పర్యటిస్తూ ఇటు క్యాడర్ తో పాటు ప్రజలను కూడా తమ పార్టీ వైపు తిప్పుకునేలా విజయ్ పర్యటనలు కొనసాగనున్నాయి.

వచ్చే ఎన్నికలకు ...
వచ్చే ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇటీవల మహానాడును నిర్వహించుకున్న పార్టీ నేటి నుంచి జిల్లా యాత్రలకు శ్రీకారం చుట్టనుంది. ఈ ఏడాది డిసెంబరు 20వ తేదీ వరకూ తమిళనాడులోని వివిధ జిల్లాల్లో తొలి దశ పర్యటన చేస్తారు. మొత్తం 38 జిల్లాల్లో ఆయన పర్యటనలు ఉంటాయి. విజయ్ కు తమిళనాట పెద్దయెత్తున ఫాలోయింగ్ ఉండటంతో ఆయన పర్యటనలకు పెద్దయెత్తున స్పందన వచ్చే అవకాశముంది.


Tags:    

Similar News