Breaking : ఉన్నావ్ అత్యాచార ఘటనలో సుప్రీం సంచలన నిర్ణయం

ఉన్నావ్ అత్యాచర ఘటనలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2025-12-29 07:06 GMT

ఉన్నావ్ అత్యాచర ఘటనలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కుల్దీప్ సింగ్ బెయిల్ ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కుల్దీప్ సింగ్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేసింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. 2017లో ఈ ఘటన జరిగింది. ఇరవై ఏళ్లు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

బెయిల్ ఉత్తర్వులను...
కుల్దీప్ సింగ్ కు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నావ్ అత్యాచార ఘటనను సీరియస్ గా తీసుకున్నామని, ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇచ్చే సమయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. లేకుంటే న్యాయవ్యవస్థ పై నమ్మకం సన్నగిల్లుతుందని అభిప్రాయపడింది. నాలుగు వారాల్లో గా కౌంటర్ దాఖలు చేయాలని కుల్దీప్ సింగ్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది.


Tags:    

Similar News