Indigo : నేటి నుంచి ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఇండిగో ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-12-26 05:48 GMT

ఇండిగో ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండిగో ప్రయాణికులకు పదివేల ట్రావెల్ ఓచర్లు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల డీజీసీఏ నిబంధనలతో అనేక ఇండిగో విమానాలు రద్దు కావడంతో తమ ప్రయాణాలను ప్రయాణికులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విమానాలు రద్దయిన ప్రయాణికులకు టిక్కెట్ సొమ్ము రీఫండ్ ఇచ్చింది.

పదివేల ఓచర్లు...
అయితే తాజాగా ఇండిగో సంస్థ ట్రావెల్ ఓచర్లను అందుబాటులోకి తెచ్చింది. వీటి విలువ పది వేల రూపాయలు అని ఇండిగో సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇండిగో విమానం బయలుదేరడానికి ఇరవై నాలుగు గంటల్లోగా విమాన సర్వీసులు రద్దయిన వారికే ఈ ట్రావెల్ ఓచర్లు వర్తిస్తాయి. డీజేసీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇండిగో ఈ వోచర్లను సిద్ధం చేసింది. నేటి నుంచి అందుబాటులోకి రానుంది.


Tags:    

Similar News