Narendra Modi : నరేంద్ర మోదీ నేడు కీలక సమావేశం

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు

Update: 2025-12-26 02:39 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన చీఫ్ సెక్రటరీల సమావేశం జరగనుంది. మొత్తం మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. వికసిత్ భారత్ -2047 లక్ష్యం చేరుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా చీఫ్ సెక్రటరీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం...
ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం బలోపేతం ప్రధాన అజెండా చర్చ జరగనుంది. విద్య, ఆరోగ్యం, ఆర్థికం, ఫ్రాంటియర్ టెక్నాలజీలు, బెస్ట్ ప్రాక్టీస్ లపై ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీలు చర్చించనున్నారు. దీనిపై ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాలను నివేదిక రూపొంలో తయారు చేయనున్నారు. ఈ సమావేశం కీలకం కావడంతో ప్రధాని మోదీ స్వయంగా హాజరై చీఫ్ సెక్రటరీలకు దిశానిర్దేశం చేయనున్నారు.


Tags:    

Similar News