టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం
నటుడు, టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు
నటుడు, టీవీకే చీఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జన నాయగన్ సినిమానే తన ఆఖరి మూవీ అని విజయ్ ప్రకటించారు. రాజకీయాలకు ఇక గుడ్ బై చెప్పినట్లే అని తన అభిమానులకు స్పష్టం చేశారు. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. జననాయక్ ఇక తన చివరి సినిమా అని ప్రకటించి అభిమానులను నిరాశకు గురి చేశారు.
ఇక సినిమాలు చేయబోను...
తాను ఇక సినిమాలు చేయబోనని విజయ్ ప్రకటించారు. ఇంత కాలం తనను సపోర్ట్ చేసిన వారి కోసం మరో ముప్ఫయి ఏళ్లు నిలబడతానని విజయ్ ప్రకటించారు. అభిమానులకు సేవ చేసేందుకు.. సినిమాలకు స్వస్తి అని విజయ్ ప్రకటించారు. అభిమానులు నిరాశపడవద్దని, ఇన్నాళ్లూ ప్రజలే మనల్ని ఆదరించారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని విజయ్ అన్నారు. వారికి సేవ చేయడం కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని విజయ్ తెలిపారు.