Delhi : వాయు కాలుష్యంపై నేడు సుప్రీంలో విచారణ
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో వాయు కాలుష్యం నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. గత కొద్ది రోజుల నుంచి ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు గాలి నాణ్యత తగ్గిందని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.
వాయు కాలుష్యం పెరగడంతో...
ఢిల్లీ, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా వంటి ప్రాంతాల నుంచి పంట వ్యర్థ పదార్థాలను తగులబెడుతుండంతో వాయు కాలుష్యం మరింత పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయుకాలుష్యంపై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపి ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేసే అవకాశముంది. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించి తెలుసుకోనుంది.