Supreme Court : ఇండిగో సమస్యపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఇండిగో సమస్యపై అత్యవసర విచారణను చేపట్టలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది
ఇండిగో సమస్యపై అత్యవసర విచారణను చేపట్టలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇప్పటికే ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి చర్యలను ప్రారంభించిందని పేర్కొంది. ఇండిగో విమానాలు రద్దు కావడంతో లక్షలాది మంది ప్రయాణికులు గత వారం రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది.
అత్యవసర విచారణ చేపట్టేందుకు...
దీనిపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అయితే ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఇది తీవ్రమైన సమస్యేనని, దీనిపై ఇప్పటికిప్పుడు విచారణ చేయడం ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో తాము అత్యవసర విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.