Supreme Court : వక్ఫ్ ఆస్తుల చట్టంపై సుప్రీం కీలక ఆదేశాలు
వక్ఫ్ ఆస్తుల చట్టంపై కీలక ప్రొవిజన్ ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది
వక్ఫ్ ఆస్తుల చట్టంపై కీలక ప్రొవిజన్ ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వక్ఫ్ సవరణ చట్టం 2025లో ఉన్న కీలక ప్రొవిజన్ ను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న కీలక ప్రొవిజన్ పై స్టే విధించింది.
చట్ట సవరణపై...
ఒకరు ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిబంధనలను రూపొందించేంత వరకూ ఈ స్టే అమలులో ఉంటుందని చెప్పింది. వక్ఫ్ ఆస్తుల విషయంలో కలెక్టర్లకు కూడా అధికారం లేదన్న సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇందులో ఇస్లాంకు చెందిన వారుండాలన్నారు. అయితే ఇదే సందర్భంలో వక్ఫ్ సవరణ చట్టంపై మొత్తంగా స్టే విధించడానికి మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రమే రక్షణ అవసరమని తాము భావిస్తున్నట్లు తెలిపింది.