Road Accident : రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సీరియస్
జాతీయరహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సమోటోగా విచారణ చేపట్టింది.
జాతీయరహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సమోటోగా విచారణ చేపట్టింది. రాజస్థాన్, తెలంగాణలో జరిగిన ప్రమాదాలపై నివేదిక ఇవ్వాలని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థను ఆదేశించింది. ఇటీవల కాలంలో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎక్కువ మంది మృత్యువాత పడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును విచారణకు చేపట్టింది. అలాగే దేశంలోని జాతీయ రహదారులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర రావాణా శాఖకు ఆదేశం జారీ చేసింది.
జాతీయ రహదారులపై అధ్యయనం చేసి...
జాతీయ రహదారులపై అనుమతి లేకుండా ఎన్ని దాబాలు ఉన్నాయో సర్వే చేయాలని సూచించింది. హైవేలపై ఉన్న దాబాలలో టీ, అల్పాహారం, భోజనం చేయడానికి వాహనాలను నిలిపివేస్తూ ఉండటంపైనకూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. జాతీయ రహదారుల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రహదారుల నిర్వహణ సమయంలో కాంట్రాక్టర్లు తగిన ప్రమాణాలు పాటించారో లేదో వెల్లడించాలన్న సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ రహదారులపై ప్రమాదాలను నివారించడానికి అవసరమైన అన్నిచర్యలు తీసుకునేలా స్పష్టమైన నివేదిక సమర్పించాలని కోరింది.