పూరి జగన్నాధ రథయాత్రలో విషాదం.. తొక్కిసలాటలో ముగ్గురి మృతి

ఒడిశాలోని పూరి జగన్నాధ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు.

Update: 2025-06-29 04:07 GMT

ఒడిశాలోని పూరి జగన్నాధ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు. పదిమంది వరకూ గాయాలయ్యాయి. పూరి జగన్నాధ రథయాత్ర జరుగుతున్న సమయంలో గుండిచా ఆలయం వద్ద ఈ తొక్కిసలాట జరిగింది. మృతులను ప్రేమకాంత మొహంతి, బసంతి సాహు, ప్రభాతి దాస్ లుగా గుర్తించారు.

పది మందికి గాయాలు...
పూరి జగన్నాధ రథయాత్ర గత రెండు రోజులుగా జరుగుతుంది. మొత్తం పన్నెండు రోజుల పాటు జరగనున్న ఈ యాత్రకు దేశం నలుమూలల నుంచిఇరవై లక్షల మంది వరకూ భక్తులు తరలి వస్తారని అంచనా వేసిన ఒడిశా ప్రభుత్వం పూరి జగన్నాధ రథయాత్ర కు భారీగా పోలీసులను నియమించింది. అయినా రథాన్ని లాగేందుకు పోటీ పడటంతో తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News