Nepal : నేపాల్ నుంచి నేడు భారత్ కు ప్రత్యేక విమానం
నేపాల్ నుంచి భారతీయుల తరలింపునకు రంగం సిద్ధం అయింది. నేపాల్ కు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన వారిని నేడు భారత్ కు తీసుకురానుంది
నేపాల్ నుంచి భారతీయుల తరలింపునకు రంగం సిద్ధం అయింది. నేపాల్ కు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన వారిని నేడు భారత్ కు తీసుకురానుంది. నేపాల్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నేపాల్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిని తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానం నేడు భారత్ కు చేరుకోనుంది. వారిని తమ సొంత ప్రాంతాలకు చేరుస్తారు.
217 మందిని తీసుకుని...
నేపాల్ లోని ఖాట్మండు నుంచి ప్రత్యేక విమానం బయలుదేరి 217 మంది తరలించనున్నారు. తొలి విడతగా హెటౌడాలో 22 మందిని బిహార్ సరిహద్దుకు తరలించనున్నారు. బిహార్ సరిహద్దు నుంచి ఢిల్లీలోని ఏపీ భవన్‌కు తరలించనున్నారు. మిగిలిన వారిని వారి వారి ప్రాంతాలకు ప్రత్యేక బస్సుల్లో పంపనున్నారు. మరొకవైపు భారత్ - నేపాల్ సరిహద్దుల మధ్య భద్రతను కట్టుదిట్టం చేసింది.