నేడు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్

శ్రీహరికోట నేడు మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమయింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు

Update: 2024-02-16 02:57 GMT

శ్రీహరికోట నేడు మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమయింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు అంతా సిద్ధం చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2.05 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం 5.35 గంటలకు ప్రయోగం జరగనుంది. ఇన్సాట్ త్రీడీఎస్ ఉగ్రహాన్ని నింగిలోకి ఇస్రో శాస్త్రవేత్తలు పంపనున్నారు.

రేపు నింగిలోకి...
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 14 రాకెట్ ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు. 2,275 కిలోల బరువు గల కలిలగిన INSAT 3DS ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు అంతా సిద్దహయింది. వాతావరణ పరిస్థితుల అధ్యయనం కోసం ఈ రాకెట్ ను షార్ ప్రయోగించనుంది. ఇస్రోలో ఈ మేరకు అంతా సిద్ధం చేసింది. ఈ ప్రయోగం విజయవంతం అవ్వాలని యావత్ భారతదేశం కోరుకుంటుంది.


Tags:    

Similar News