YSRCP : శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ నేత అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ నేతను కదిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

Update: 2025-06-01 05:53 GMT

శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ నేతను కదిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు. కదిరిలోని పెట్రోల్ బంకులో యువకుడిని స్తంభానికి కట్టేసి కొట్టని కేసులో పోలీసులు బత్తల హరిప్రసాద్ పై చర్యలు తీసుకున్నారు. డబ్బుల వ్యవహారంలో తేడా వచ్చిందని బత్తల హరిప్రసాద్ యువకుడిని కట్టేసి చావబాదాడు.

పెట్రోలు బంకులో...
విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ ను విచారించిన తర్వాత న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశముంది. పెట్రోలు బంకులో తలెత్తిన వివాదంతోనే వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ అక్కడ పనిచేసే యువకుడిపై దాడి చేశాడని పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News