Corona Virus : కేరళ వెళుతున్నారా? అయితే జాగ్రత్త.. కరోనా కేసులు అక్కడ ఎక్కువే

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటికే కేసుల సంఖ్య ఏడువేలకు పైగానే ఉంది.

Update: 2025-06-14 12:28 GMT

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇప్పటికే కేసుల సంఖ్య ఏడువేలకు పైగానే ఉంది. ఎనిమిది వేల కేసులకు దగ్గరలో ఉంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో భారత్ లో కొత్తగా రెండు వందలకు పైగానే కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వందల కేసులు ప్రతి రోజూ వెలుగు చూస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలని అలెర్ట్ చేసింది. ఒక్కరోజులోనే 269 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 7,400 కు పెరిగింది.

మరణాలు కూడా...
ఇక మరణాల సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది మంది కరోనా కారణంగా మరణించారు. ఇందులో మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ముగ్గురు, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్ర్రాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా కారణంగా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ భారత్ లో మొత్తం 87 మంది కరోనా కారణంగా మరణించారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు ఎక్కువ మంది కరోనా వైరస్ తో బాధపడుతూ మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
అత్యధికంగా ఎక్కువ...
అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కేరళలో 2,109 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉండటంతో అక్కడ పర్యాటక రంగంపై కూడా ప్రభావం పడనుంది. గుజరాత్ లో 1,437, పశ్చిమ బెంగాల్ లో 747, ఢిల్లీలో 672, మహారాష్ట్రలో 613, కర్ణాటకలో 527 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. మొత్తం పదకొండు వేల మంది కరోనా వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకూ 11,967 మంది కోలుకున్నారు. ప్రజలు మాస్క్ లను ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేస్తూ కరోనా వైరస్ నుంచి కాపాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.


Tags:    

Similar News