Supreme Court : ఆర్థిక నేరాల కోసం ప్రత్యేక కోర్టులు సృష్టించే సమయం ఆసన్నమైంది

సంక్లిష్టమైన ఆర్థిక, న్యాయపరమైన సమస్యలపై తీర్పు ఇచ్చేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది.

Update: 2025-08-06 03:06 GMT

సంక్లిష్టమైన ఆర్థిక, న్యాయపరమైన సమస్యలపై తీర్పు ఇచ్చేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. ఫైనాన్స్, ఇతర రంగాలకు చెందిన నిపుణులచే శాస్త్రీయ పరిశోధన అవసరమని కూడా అత్యున్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌లోని బొగ్గు లెవీ కుంభకోణంలో నిందితుడైన సూర్యకాంత్ తివారీ బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జైమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేస్తూ ధర్మాసనం మాట్లాడుతూ.. సంక్లిష్టమైన ఆర్థిక, చట్టపరమైన సమస్యలపై తీర్పు ఇవ్వడానికి ప్రత్యేక కోర్టులను సృష్టించే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించింది. క్లిష్టమైన ఆర్థిక నేరాలను పరిష్కరించేందుకు, కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయమూర్తులకు శిక్షణ ఇవ్వాలి. దోషులను విడిచిపెట్టకూడదు, కానీ అమాయకులను త్వరగా విడుదల చేయాలని పేర్కొంది.

న్యాయమూర్తులకు న్యాయం చేసేందుకు సమర్థులైన ప్రాసిక్యూటర్లు, ఇన్వెస్టిగేటర్లు అవసరమని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది మహేశ్ జెత్మలానీకి ధర్మాసనం తెలిపింది. మీ రాష్ట్రంలో ఆర్థిక నేరాలకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు శాఖ ఉందా.? అని ప్ర‌శ్నించింది. సాధారణంగా, ఆర్థిక నేరాలు ఒప్పుకోలు ఆధారంగా ప్రస్తుతం డీల్ చేయబడతాయి. నేరాంగీకారాన్ని పొందడానికి మీరు నిందితులను జైలులో ఉంచాలి. సమాచారాన్ని సేకరించి కేసును నిరూపించడానికి ప్రయత్నించాలని వ్యాఖ్యానించింది.

తీవ్రమైన నేరాలను త్వరితగతిన విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసే ఆర్థిక సామర్థ్యం ప్రస్తుతం చాలా రాష్ట్రాలకు లేదని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. వారి వద్ద జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేవు. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వారికి సహాయం చేయగలదు. అందుకే కొన్ని సందర్భాల్లో ఈ అంశంపై కేంద్రం నుంచి స్పందన కోరాం. కేవలం ప్రదర్శన కోసమే నిందితులను జైల్లో ఉంచారని ధర్మాసనం పేర్కొంది. ఏ రాష్ట్రంలోనూ సాక్షుల రక్షణకు బలమైన వ్యవస్థ లేదని పేర్కొంది.

సాక్షుల రక్షణ కోసం మీ రాష్ట్రానికి ఎంత డబ్బు కేటాయించారో మీరు అడగవచ్చు, సమాధానం ఏమీ ఉండదని బెంచ్ జెత్మలానీకి తెలిపింది. ప్రస్తుతం జైళ్లు నేరస్తులకు సురక్షిత స్థావరాలుగా మారి అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. తివారీ రెండేళ్లకు పైగా జైలులో ఉన్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో 300 మందికి పైగా సాక్షులు సాక్ష్యం చెప్పాల్సి ఉంది కాబట్టి ఆయనకు బెయిల్ మంజూరు చేయడం సముచితమని, ఇతర కేసుల్లో తివారీ బెయిల్ రద్దు చేయాలని.. సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జెఠ్మలానీ వాదించారు.

ప్రాసిక్యూషన్ చాలా మంది సాక్షులపై ఆధారపడే బదులు శాస్త్రీయ దర్యాప్తుపై ఆధారపడాలని, ఇది కేసును సమర్థవంతంగా నిర్ణయించడంలో కోర్టుకు సహాయపడుతుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో త్వరితగతిన విచారణ జరపాలని కోర్టు ఆదేశిస్తే, ప్రాసిక్యూషన్, కోర్టులపై తీవ్ర ఒత్తిడి వస్తుందని, సాక్షులను విడుదల చేయాల్సి వస్తుందని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.

Tags:    

Similar News