ఇస్రో ఛైర్మన్ గా సోమనాధ్
ఇస్రో ఛైర్మన్ గా ఎస్ సోమనాధ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ కె. శివన్ పదవీ కాలం ఈ నెల 14వ తేదీతో ముగియనుంది
ఇస్రో ఛైర్మన్ గా ఎస్ సోమనాధ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ కె. శివన్ పదవీ కాలం ఈ నెల 14వ తేదీతో ముగియనుండటంతో సోమనాధ్ ను నియమించారు. ఆయన 2018 నుంచి విక్రం సారాభాయి అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
కేరళకు చెందిన...
సోమనాధ్ కేరళకు చెందిన వారు. భారత్ లోనే టాప్ ర్యాకెట్ సైంటిస్టుల్లో ఒకరుగా ఉన్నారు. ఉపగ్రహ వాహన నౌకల డిజైనింగ్ సోమనాధ్ ప్రత్యేకత. ఈ నెల 14వ తేదీన ఇస్రో ఛైర్మన్ గా సోమనాధ్ బాధ్యతలను స్వీకరించనున్నారు.