Pahalgam Attack : ఉగ్రవాదులు అక్కడే ఉన్నారట.. వారి కోసం వేట?
పహాల్గాంలో జరిగిన దాడికి పాల్పడిన వారి ఆచూకీ కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
పహాల్గాంలో జరిగిన దాడికి పాల్పడిన వారి ఆచూకీ కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. జమ్మూ కాశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదుల కోసం వెదుకుతున్నారు. ఇప్పుడిప్పుడే దాడికి సంబంధించిన ఆధారాలు లభించడంతో వారి కోసం వేటను ముమ్మరం చేశాయి. కశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నాయి.
పిర్‌పంజాల్ వద్ద...
పిర్‌పంజాల్ దగ్గర అడవుల్లో దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతాదళాలు పహల్గామ్ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం వెదుకుతున్నారు. ఎల్‌వోసీ గుండా సరిహద్దు దాటాలని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం అందింది. డ్రోన్లు, యూఏవీలు, స్నిపర్ డాగ్‌లతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. పహల్గామ్ దాడిలో ఐదు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారని చెబుతున్నారు. ఈ ఉగ్రవాదులపై ఒక్కొక్కరికి రూ.20 లక్షల రివార్డును కూడా ప్రభుత్వం ప్రకటించింది.