పింఛన్ డబ్బులు పొదుపు చేసి భారత సైన్యానికి 10 లక్షలు

ఓ మహిళ 10 లక్షల రూపాయలను భారత సైన్యానికి విరాళంగా అందించారు.

Update: 2025-05-29 13:45 GMT


ఓ మహిళ 10 లక్షల రూపాయలను భారత సైన్యానికి విరాళంగా అందించారు. హైదరాబాద్‌, అల్వాల్‌కు చెందిన సింగంసెట్టి అనురాధ భర్త ప్రభుత్వ ఉద్యోగి. ఆయన కొన్నేళ్ల క్రితం మరణించారు. అనురాధ ఇద్దరు కుమారులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు.


వారిలో ఒకరు అమెరికాలో స్థిరపడగా, మరొకరు హైదరాబాద్‌లోనే ఉద్యోగం చేస్తున్నారు. పెన్షన్‌గా తనకు నెలనెలా అందే సొమ్ములో కొంత మొత్తాన్ని పొదుపు చేసిన అనురాధ. ఆ మొత్తం నుంచి 10లక్షల రూపాయలను సైనిక సంక్షేమ నిధికి ఇచ్చారు. డిమాండ్‌ డ్రాఫ్ట్‌ ని సికింద్రాబాద్‌లోని తెలంగాణ, ఆంధ్రాసబ్‌ ఏరియా కార్యాలయంలో బ్రిగేడియర్‌ నంజుడేశ్వర్‌, టాసా డిప్యూటీ జీవోసి బ్రిగేడియర్‌ రాజీవ్‌కు అందజేశారు.

Tags:    

Similar News