Sabarimala : నలభై రోజుల్లో శబరిమల ఆదాయం ఎంతంటే?
గడిచిన నలభై రోజుల్లో శబరిమల ఆలయానికి 204 కోట్ల రూపాయలు ఆదాయిం వచ్చింది
sabarimala
గడిచిన నలభై రోజుల్లో శబరిమల ఆలయానికి 204 కోట్ల రూపాయలు ఆదాయిం వచ్చింది. 63.89 విలువైన కానుకలు అందాయి. ఈ మేరకు ట్రావెన్ కోర్ దేవస్థానం కమిటీ ప్రకటించింది. మండల పూజలకు భక్తులు శబరిమలకు పోటెత్తారు. రోజుకు లక్ష మంది భక్తులు కూడా ఒక దశలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని దేవస్థానం కమిటీ తెలిపింది. ఇప్పటి వరకూ దాదాపు ముప్ఫయి ఒక్క లక్షల మంది భక్తులు శబరిమలను దర్శించుకున్నారని ఆలయ కమిటీ తెలిపింది.
దర్శనానికి పదిహేను గంటలు...
గత కొద్దిరోజులుగా మండల పూజ కోసం వచ్చిన అయ్యప్ప భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది. శబరిమలలో ఈరోజు కూడా భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతుందని ఆలయ కమిటీ తెలిపింది. ఆలయంలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది.