Bihar : ప్రమాణ స్వీకారం తేదీని ప్రకటించిన తేజస్వి యాదవ్
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
బీహార్ శాసనసభ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పాయి. కానీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేయడమే కాకుండా తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే తేదీని కూడా తేజస్వి యాదవ్ ప్రకటించారు.
18న ప్రమాణ స్వీకారం...
బీహార్ ఎన్నికల్లో తమదే గెలుపు అని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. అధికారుల ఒత్తిడితో మీడియా తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిందని తేజస్వి యాదవ్ మండిపడ్డారు. నవంబర్ 14న మహాఘట్బంధన్ కు అనుకూలంగా ఫలితాలు వస్తాయని, 18న ప్రమాణస్వీకారం ఉంటుందని చెప్పారు. బిహార్ ప్రజలు ఎన్డీఏ పాలనతో విసిగిపోయారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని పేర్కొన్నారు. రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తేజస్వి యాదవ్ ఈ ప్రకటన చేశారు.