అసోంలో అమిత్ షా పర్యటన

నేడు అసోంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు

Update: 2026-02-20 04:25 GMT

నేడు అసోంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. భారత్-బంగ్లాదేశ్‌ సరిహద్దులోని నాథన్‌పూర్ అవుట్‌పోస్ట్‌ను అమిత్ షా సందర్శించనున్నారు.మూడు రోజుల అస్సాం పర్యటన కోసం అమిత్ షా వచ్చారు. అసోంలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అమిత్ సా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ను కూడా అమిత్ షా ప్రారంభించనున్నారు.

ఎన్నికల ప్రచారాన్ని...
సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెంచడమే కాకుండా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం కోసం, వలసలను అరికట్టడం కోసం వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ను చేపట్టారు. తర్వాత షా బరాక్ లోయలో అమిత్ షా బీజేపీ ర్యాలీలో పాల్గొంటారు. ప్రసంగించనున్నారు. అసోం ఎన్నికల ప్రచారాన్ని అమిత్ షా అధికారికంగా ప్రారంభిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో అమిత్ షా పాల్గొననున్నారు.


Tags:    

Similar News