Breaking : ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తాకు అవకాశం ఇచ్చారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తాకుఅవకాశం ఇచ్చారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి గా రేఖాగుప్తా ఎదిగారు. బీజేపీలో సామాన్య కార్యకర్తగా జీవితాన్నిప్రారంభించిన రేఖాగుప్తాను బీజేపీ పార్లమెంటరీపార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రిపదవికి ఎంపిక చేసింది. గత కొన్ని రోజులుగా మహిళా ముఖ్యమంత్రిని నియమిస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అదే చివరకు నిజమయింది.
అనేక పదవులు...
ఢిల్లీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. పర్వేశ్ వర్మ, రేఖాగుప్తాల మధ్య చివరకు పోటీ నడిచినా ఎట్టకేలకు రేఖాగుప్తాకే ముఖ్యమంత్రి పదవి వరించింది. విద్యార్థి నాయకురాలి నుంచి ఆమె కార్పొరేటర్ గా ఎదిగారు. ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. అలాంటి రేఖాగుప్తాకు చివరకు అవకాశం దక్కడంతో దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తొలి మహిళ సీఎంగా ఎన్నికయినట్లయింది.