Good News : ఉద్యోగులకు తీపికబురు.. రైల్వేలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ

రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమయింది.

Update: 2025-01-22 08:27 GMT

రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమయింది. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 32,428 ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. నేటి నుంచి ఫిబ్రవరి 23 వతేదీ వరకూ ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. పదోతరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణులయిన వారు ఈ పోస్టులకు అర్హులుగా నిర్ణయించింది.

పది లేదా ఐటీఐ చదివిన వారు...
లెవల్ -1 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధం కావడంతో అతిపెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. దీనికి వయసు 18 నుంచి 36 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తు రుసం ఐదు వందల రూపాయలుగా నిర్ణయించింది. సీబీటీ, పీఈటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తరవ్ాత అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. పురుషులతో పాటు మహిళలు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశముంది.


Tags:    

Similar News