రేపు గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం
గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతి రాజు ఈ నెల 26న ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు
గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతి రాజు ఈ నెల 26న ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం కుటుంబ సమేతంగా గోవా రాష్ట్రానికి అశోక్ గజపతిరాజు బయలు దేరి వెళ్ళారు. గోవా గవర్నర్ గా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అశోక్ గజపతి రాజును నియమించిన సంగతి తెలిసిందే.
గోవాకు బయలుదేరిన...
అశోక్ గజపతి రాజు వెంట వంద మంది అభిమానులు పయనమయి బయలుదేరి వెళ్లారు. భారీ సెక్యూరిటీ నడుమ విశాఖ ఎయిర్ పోర్టు నుంచి అశోక్ గజపతి రాజు చేరుకున్నారు. విశాఖ నుండి హైదరాబాద్ కు...హైదరాబాద్ నుండి గోవా కు అశోక్ గజపతి రాజు వెళ్లనున్నారు. విజయనగరం జిల్లా నుంచి మొట్ట మొదటి సారిగా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్న అశోక్ గజపతిరాజును పలువురు అభినందించారు.