పూరన్ కుమార్ కేసులో మరో ట్విస్ట్.. దర్యాప్తు అధికారి బలవన్మరణం

హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.

Update: 2025-10-14 12:09 GMT

హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ఆత్మహత్య కేసు విచారణ చేస్తున్న ఏఎస్ఐ సందీప్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు దేశంలోనే తీవ్ర కలకలం రేగడంతో పాటు రాజకీయంగా కూడా ఇబ్బందిగామారడంతో హర్యానా ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో ఒక బృందాన్ని విచారణ కోసం నియమించింది. 2001 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ తెలుగు రాష్ట్రానికి చెందిన వారు.

ఆరుగురు సభ్యుల బృందంలో...
ఈ విచారణ బృందంలో ఏఎస్ఐ సందీప్ ఒకరు. ఆయన కొద్దిసేపటి క్రితం తన తుపాకీతో కాల్చుకుని చనిపోవడం మరింత చర్చనీయాంశంగామారింది. ప్రస్తుతం సందీప్ రోహతక్ సైబర్ సెల్ లో ఏఎస్ఐ గా పనిచేస్తున్నారు. అయితే ఇతను కూడా సూసైడ్ నోట్ ఒకటి బయటకు వచ్చింది. ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుల వివక్షతకు గురి కావడంతోనే తాను చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం వెంటనే డీజీపీ శత్రుజిత్ కపూర్ ను దీర్ఘకాలిక సెలవుపై పంపింది. రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాపై బదిలీ వేటు వేసింది.


Tags:    

Similar News