PSLV C 61 : నింగిలోకి దూసుకెళ్లినా.. మూడో దశలో మాత్రం?

పీఎస్ఎల్వీ - సి 61 రాకెట్ నింగిలోకి వెళ్లినా సాంకేతిక సమస్య తలెత్తింది.

Update: 2025-05-18 02:01 GMT

పీఎస్ఎల్వీ - సి 61 రాకెట్ నింగిలోకి వెళ్లినా సాంకేతిక సమస్య తలెత్తింది. ఈరోజు తెల్లవారు జామున భారత అంతరిక్ష సంస్థ 101వ రాకెట్ ప్రయోగం చేపట్టింది. పీఎస్ఎల్వీ - సి 61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే కొద్దిసేపటి తర్వాత దీని ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో పీఎస్ఎల్వీ - సి 61 ప్రయోగం పూర్తి కాలేదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. మూడో దశ తర్వాత రాకెట్ లో సమస్య వచ్చిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. పూర్తిగా విశ్లేషించుకున్న తర్వాత అన్ని వివరాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

101 రాకెట్ ప్రయోగం....
ఈ ఏడాది జనవరిలో 100 వ రాకెట్ ప్రయోగాల మైలురాయిని అందుకున్న ఇస్రో తరువాత రాకెట్ లాంచ్ కు సిద్ధమయింది. ఈరోజు శ్రీహరికోటలోని షార్ నుంచి సీఎస్ఎల్ వీ సీ 61ను ప్రయోగించింది. ఇది ఇస్రోకు 101వ రాకెట్ ప్రయోగం కానుంది. దీని ద్వారా భూ పరిశోధన ఉపగ్రహం రీశాట్ 18 ను కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నా రు. శనివారం ఉదయం 7:59 గంటలకు ఈ మిషన్ కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. నిరంతరంగా 22 గంటల పాటు కొనసాగిన తర్వాత ఆదివారం ఉదయం 5:59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
ఐదేళ్ల జీవిత కాలంతో...
ఈ సారి నింగిలోకి ఎన్వీఎస్ 02 శాటిలైట్ వెళ్లనుంది. ఇది నావిక్ రెండో సిరీస్‌కి సంబంధించినది. ఇది ఇచ్చే సమాచారం.. మ్యాప్‌లకు బాగా ఉపయోగపడు తుంది. భూమి, ఆకాశం, నీటిపై ప్రయాణాలకు ఈ శాటిలైట్ దారి చూపిస్తుంది. ఇది మొత్తం 2,250 కేజీల బరువు ఉన్న శాటిలైట్. ఇది భూ కక్ష్యా మార్గంలోకి వెళ్లాక.. జీపీఎస్ సేవల్ని అందిస్తుంది. పీఎస్ఎల్వీ సి 61 గురించి తర్వాత వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. ఈఓఎస్ ఉపగ్రహం బరువు 1696 .24 కిలోలు. ఐదేళ్ల జీవిత కాలంగా నిర్ణయించారు. జాతీయ భద్రత, వ్యవసాయం, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాలను 24 X 7 ఇమేజింగ్ చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివాలను శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Tags:    

Similar News