ఇస్రోకు మరో సక్సెస్: ఎక్స్‌పోశాట్ ప్రయోగం విజయవంతం

2023లో చంద్రుడిని జయించిన తర్వాత, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ

Update: 2024-01-01 05:03 GMT

PSLV-C58 launched with XPoSAT mission: Isro begins 2024 with success

2023లో చంద్రుడిని జయించిన తర్వాత, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2024లో ఎక్స్‌పోశాట్ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రపంచం 2024కి స్వాగతం పలుకుతున్న వేళ భారత కాలమానం ప్రకారం ఉదయం 9:10 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ58 మిషన్ ఆకాశంలోకి ఎగిసింది. బ్లాక్ హోల్స్‌తో సహా విశ్వంలోని చాలా విషయాల గురించి తెలుసుకోవడం కోసం ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

ఇస్రో ఎక్స్-రే పొలారీమీటర్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నేడు ఉదయం 9.10 గంటలకు ఎక్స్‌పోశాట్‌తో పీఎస్ఎల్వీ సీ58 ఉపగ్రహం నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగిసింది. ప్రయోగం తరువాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకుంది. ఎక్స్‌పోశాట్‌తో పాటూ తిరువనంతపురం ఎల్‌బీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారు చేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిద ఉపకరణాలు కూడా ఉన్నాయి. ప్రయోగం చివరి దశలో పీఎస్‌ఎల్‌వీ మరో పది పరికరాలతో కూడి పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఎక్స్‌పోశాట ప్రధాన లక్ష్యం కృష్ణబిలాల అధ్యయనమని ఇస్రో తెలిపింది. ఎక్స్‌రే ఫొటాన్లు, వాటి పొలరైజేషన్ ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్‌పై ఎక్స్‌పోశాట అధ్యయనం చేయనుంది. ఈ మిషన్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ప్రకటించారు. బ్లాక్ హోల్స్ గురించి అధ్యయనం చేయడానికి ప్రత్యేక అంతరిక్ష నౌకను పంపిన రెండో దేశంగా భారత్ నిలిచింది.


Tags:    

Similar News