Congress : ఆమ్ ఆద్మీ అభ్యర్థికి ఓటేసిన రాహుల్, సోనియా

ఆరోవిడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

Update: 2024-05-25 04:47 GMT

ఆరోవిడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. ఉత్తరాది రాష్టాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండటంతో ఉదయమే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తారు. ఎండ తీవ్రత అధికమయ్యే సరికి ఓట్లు వేసి వెళ్లాలని భావించి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

తొలిసారి కాంగ్రెసేతర అభ్యర్థికి...
కాగా ఈరోజు తమ ఓటు హక్కును కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు ఓటు వేశారు. అయితే తొలిసారి కాంగ్రెసేతర అభ్యర్థికి ఇద్దరూ ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమిలో పొత్తులో భాగంగా న్యూ ఢిల్లీ నుంచి స్థానం నుంచి ఆమ్ ఆద్మీపార్టీ అభ్యర్థి సోమ్ నాధ్ భారతి పోటీ చేస్తున్నారు. దీంతో ఈరోజు ఇద్దరూ ఆప్ అభ్యర్థికి ఓటు వేసి తొలిసారి కాంగ్రెసేతర అభ్యర్థికి మద్దతు తెలిపినట్లయింది.


Tags:    

Similar News