Narendra Modi : నేడు యూపీ, రాజస్థాన్ కు ప్రధాని మోదీ
నేడు ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు
నేడు ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని రాజస్థాన్ బన్స్‌వారాలో రూ.1,22,100 కోట్లవిలువైన పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు ప్రధాని నరేంద్ర మోదీ చేయనున్నారు.క్లీన్ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులతో పాటు పలు విద్యుత్ ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు.
పలు ప్రాజెక్టులకు ....
రాజస్థాన్ రాష్ట్రంలో అణు విద్యుత్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఈ రాష్ట్రం నుంచి మూడు రైళ్లను జెండా ఊపి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అలాగే పదిహేను వేల మందికి నియామక పత్రాలు నరేంద్ర మోదీ అందచేయనున్నారు. దీంతో పాటు నోయిడాలో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనకు హాజరు కానున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.