Narendra Modi : నేడు అహ్మదాబాద్ కు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు అహ్మదాబాద్ కు బయలుదేరి వెళ్లనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు అహ్మదాబాద్ కు బయలుదేరి వెళ్లనున్నారు. మరికాసేపట్లో ఆయన అహ్మదాబాద్ కు చేరుకుంటారు. అహ్మదాబాద్ లో నిన్న విమాన ప్రమాద దుర్ఘటనలో దాదాపు 265 మంది మరణించిన నేపథ్యంలో నేడు మోదీ అహ్మదాబాద్ లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడులు చేరుకుని పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
సంఘటన స్థలి వద్ద...
ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ కు చేరుకుని విమాద ప్రమాద ఘటనను పరిశీలిస్తారు. అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకుంటారు. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను కూడా మోదీ పరామర్శించనున్నారు. అదే సమయంలో విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను కూడా మోదీ పరామర్శించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.