నేడు ప్రయాగ్ రాజ్ కు ప్రధాని మోదీ

ఈరోజు ప్రయాగ్‌రాజ్‌ కు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లనున్నారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేయనున్నారు

Update: 2025-02-05 02:50 GMT

ఈరోజు ప్రయాగ్‌రాజ్‌ కు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లనున్నారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేయనున్నారు. ప్రయాగ్ రాజ్ లో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కుంభమేళాలో మోదీ పుణ్య స్నానం చేయనున్నారు. నిన్ననే ఆయన రావాల్సి ఉన్నప్పటికీ లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉండటంతో ఈ కార్యక్రమం నేటికి వాయిదా వేసుకున్నారు.

పుణ్యస్నానాలు చేసేందుకు...
144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు ఇప్పటికే కోట్లాది మంది భక్తుల తరలి వచ్చారు. రోజుకు కోటి మందికి పైగా భక్తులు వచ్చి గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఈరోజు మోదీ ప్రయాగ్ రాజ్ వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News