Narendra Modi : నేడు బెంగాల్ కు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్నారు

Update: 2026-01-17 04:41 GMT

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్నారు. బెంగాల్ లో దాదాపు 3,250 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో రైలు, రోడ్లు ప్రాజెక్టుల పనులకు సంబంధించి శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ చేయనున్నారు.

తొలి స్లీపర్ వందేభారత్ రైలును...
హౌరా - గౌహతి మధ్య దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఈ పర్యటనలో ప్రారంభించనున్నారు. రైల్వే శాఖ ప్రవేశపెట్టిన తొలి స్లీపర్ వందేభారత్ రైలును నేడు పట్టాలపైకి మోదీ జెండా ఊపిన తర్వాత పరుగులు తీయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News