Breaking : కర్రెగుట్టలో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోల మృతి
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కర్రెగుట్టలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కర్రెగుట్టలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలున్నట్లు సమాచారం. క్లైమాక్స్ కు ఆపరేషన్ కగార్ చేరుకుంది. ఆపరేషన్ కగార్ -2 పేరుతో భద్రతా బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహించాయి. దీంతో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
కీలక నేతలున్నట్లు...
ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఎవరున్నారన్న దానిపై త్వరలోనే అధికారులు ప్రకటన చేయనున్నారు. మృతదేహాల నుంచి తుపాకులు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.