Narendra Modi : ఢిల్లీ బాంబు పేలుళ్లపై మోదీ ఫస్ట్ రియాక్షన్
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్లపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్లపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దాడులకు పాల్పడిన వారిని ఎవరినీ వదిలపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భూటాన్ పర్యటనలో ఉన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్రమూలాలను గుర్తించామని తెలిపారు. ఘటననపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
చట్టం ముందు నిలబెడతామని...
ఢిల్లీ పేలుడు ఘటన తనను కలచి వేసిందన్న మోదీ భాధాకరమైన హృదయంతోనే తాను భూటాన్ వచ్చానని తెలిపారు. ఘటనకు బాధ్యులైన వారిని ఎవరినీ వదిలపెట్టే ప్రసక్తి లేదని తెలిపారు. కుట్రదారులను చట్టముందు నిలబెడతామనిచెప్పారు. బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని భూటాన్ లో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.