Maharasthtra Elections : మహారాష్ట్ర ఎన్నికలపై మోదీ స్పందన ఇలా
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
modi on maharashtra elections
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని ఆయన అన్నారు. చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లు, ముఖ్యంగా మహిళలు, యువతకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. కలసి కట్టుగా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని ఆయన తెలిపారు.
ఇచ్చిన హామీలను అమలు చేస్తామని...
మహారాష్ట్ర అభ్యున్నతికి మహాయుతి కృషి చేస్తుందన్న మోదీ ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు.అలాగే జార్ఖండ్ లో జేఎంఎం కూటమికి అభినందనలు మోదీ తెలియజేశారు. ప్రజా సమస్యలను లేవనెత్తడంలోనూ, రాష్ట్రం కోసం పనిచేయడంలోనూ ఎప్పుడూ ముందుంటామని మోదీ ట్వీట్ చేశారు.