మరోసారి పహాల్గాం దాడిని ప్రస్తావించిన ప్రధాని

పహాల్గాం దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పందించారు.

Update: 2025-04-27 07:19 GMT

పహాల్గాం దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పందించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ఉగ్రదాడి విషయాన్ని ప్రస్తావించారు. పహల్గాం ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండిస్తూనే ఈ దాడి పర్యాటకుల మీద చేసింది కాదని, యావత్ భారత్ ఆత్మపై జరిగిందని ప్రధాని పునరుద్ధాటించారు. ప్రతి భారతీయుడి గుండెలు ఈ దాడితో రగిలిపోతున్నాయన్న ప్రధాని ఎవరూ మర్చిపోలేకపోతున్నారని అన్నారు.

పర్యాటక రంగంపై...
జమ్మూకాశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఉగ్రవాదులు ఈ దాడికి దిగారని ప్రధాని మోదీ అన్నారు. పర్యాటకులను భయభ్రాంతులకు చేసి ఇక్కడ టూరిజంపై దెబ్బకొట్టే కుట్రగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అమాయకులపై దాడి చేసిన ఉగ్రవాదులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని మోదీ అన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.


Tags:    

Similar News