Narendra Modi : గోవా ప్రమాదంపై ప్రధాని ఏమన్నారంటే?

గోవాలో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Update: 2025-12-07 03:38 GMT

గోవాలో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియోను ప్రకటిస్తున్నట్లు నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు ఇస్తామని తెలిపారు.

రెండు లక్షల ఆర్థికసాయం...
గోవా అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో తాను మట్లాడానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ప్రధాని మోదీ అన్నారు. పర్యాటకుల భద్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను అందరూ పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరంద్ర మోదీ కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిందని ప్రధాని తెలిపారు.


Tags:    

Similar News