Narendra Modi : నేటి నుంచి మోదీ దక్షిణాఫ్రికా పర్యటన
ప్రధాని నరేంద్రమోదీ నేటి నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు
ప్రధాని నరేంద్రమోదీ నేటి నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సులో ఆయన పాల్గొననున్నారు. జీ 20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లారు. జోహాన్స్ బర్గ్ లో జీ 20 లీడర్స్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది.
జీ20 సదస్సులో...
ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. మోదీ మొత్తం మూడు సెషన్స్ లో ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో అభివృద్ధి సహకారం, వాతావరణ మార్పులు, ఆహారం, ఇంధన భద్రత, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై చర్చించను్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ జీ20 సభ్య దేశాలతో ద్వైపాక్షికక సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.