నేడు శబరిమలకు ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం తిరువనంతపురానికి వచ్చిన ఆమె ఈరోజు అయ్యప్ప దర్శనం చేసుకోనున్నారు. ఉదయం 7.25 గంటలకు రాష్ట్రపతి భవన్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు కాన్వాయ్ బయలుదేరింది. అక్కడి నుంచి పంబ కు చేరుకుంటారు.
దర్శనం అనంతరం...
ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూజల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. కాన్వాయ్ రిహార్సల్ ఇటీవల నిర్వహించినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అధికారులు చెప్పారు. దర్శనం అనంతరం ఆమె తిరిగి సాయంత్రం తిరువనంతపురానికి చేరుకుంటారు.