జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామా ఆమోదం
ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. నిన్న జగ్‌దీప్ ధన్‌ఖడ్ స్వయంగా రాష్ట్రపతి భవన్ కు వెళ్లి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇంకా సమయం ఉన్నప్పటికీ ముందుగానే రాజీనామా చేయడానికి గల కారణం ఆరోగ్యపరమైన విషయాలని తాను రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రపతి ఆమోదంతో...
జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామా లేఖపై విపక్షాల నుంచి విమర్శలు పెద్ద ఎత్తున విమర్శించిన నేపథ్యంలో మరో రెండేళ్లు పదవీ కాలం ఉన్నప్పటికీ ముందుగానే రాజీనామా చేయడం వెనక కారణాలపై కాంగ్రెస్ నేతలు ట్వీట్లు చేశారు. అయినా సరే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాత్రం ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ రాజీనామా లేఖను చదివి ఆమోదించారు.