ఉపరాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపు
ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది
ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. చెన్నైలోని పోయస్ గార్డెన్ నివాసానికి బాంబు బెదిరింపు ఈ మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే అది తప్పుడు అలర్ట్‌గా తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం, స్థానిక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి బాంబు బెదిరింపు ఈ మెయిల్ రావడంతో బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్‌తో కలిసి అధికారులు ఉపరాష్ట్రపతి నివాసానికి చేరుకుని సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు.
పోలీసుల విచారణలో...
పోలీసుల విచారణలో ఆ బెదిరింపు ఈ మెయిల్ కేవలం బెదిరింపుకోసమేనని స్పష్టం అయిందని ఒక పోలీస్ అధికారి తెలిపారు. గత నెల నుంచి చెన్నై పోలీసులు ఇలాంటి అనేక ఈ మెయిల్ బెదిరింపులు వస్తున్నాయని, పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ మెయిల్ పంపిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.