డీఎంకేకు షాకిచ్చిన పీఎంకే

డీఎంకే కూటమిలో ఉన్న పీఎంకే ఆ కూటమిని వీడింది. ఎన్డీఏలో చేరింది

Update: 2026-01-07 06:56 GMT

తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. అయితే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో డీఎంకే కూటమిలో ఉన్న పీఎంకే ఆ కూటమిని వీడింది. ఎన్డీఏలో చేరింది. పీఎంకే నేత అన్సుమణి రాందాస్ అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామిని కలిశారు. వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే, బీజేపీ పొత్తులో ఉండగా మరొకపార్టీ పీఎంకే కూడా కూటమిలో చేరినట్లయింది.

పొత్తు కుదిరిందని...
తమిళనాడులో 2021లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో చేరిన పీఎంకే ఐదు శాసనసభ స్థానాలను గెలుచుకుంది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు పీఎంకేకు పద్దెనిమిది శాసనభ స్థానాలు ఇచ్చేందుకు పళనిస్వామి అంగీకరించారు. గత ఐదేళ్లుగా డీఎంకే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుందని, అందుకే డీఎంకేను వదిలేశామని అన్సుమణి రాందాస్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి పోటీ చేస్తామని పీఎంకే నేత అన్సుమణి రాందాస్ తెలిపారు.


Tags:    

Similar News