Pan Card Holders : పాన్ కార్డున్న వారికి అలెర్ట్... నిబంధనల్లో భారీ మార్పులు
పాన్ కార్డు నిబంధనల్లో ఆదాయపు పన్ను శాఖ భారీ మార్పులు చేసింది
పాన్ కార్డు నిబంధనల్లో ఆదాయపు పన్ను శాఖ భారీ మార్పులు చేసింది. పాన్ కార్డులున్న వారికి ఈ మినహాయింపులతో పాటు కొన్ని షరతులను కూడా విధించింది. కొత్త నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నాయని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. అందరూ ఈ విషయాలను గుర్తుంచుకుని వ్యవహరించాలని కోరారు.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి...
ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం-2025 సామాన్యులకు ఊరటనిస్తోంది. బ్యాంకింగ్ లావాదేవీల్లో రోజువారీ రూ.50 వేల పరిమితిని తొలగించి, వార్షికంగా రూ.10 లక్షలకు మార్చారు. ఆస్తి కొనుగోలుపై పాన్ పరిమితిని 20 లక్షలకు, హోటల్ బిల్లులపై లక్ష రూపాయలకు పెంచారు. రూ.5 లక్షల లోపు వాహనాలకు పాన్ అవసరం లేదు. పన్ను నిబంధనలను సరళతరం చేస్తూ సెక్షన్లను 536కి తగ్గించారు.