భారత్ - కెనడాల మధ్య కుదిరిన ఒప్పందం
భారత్‌లో కెనడా ప్రధాని మెక్ కార్నీ పర్యటన కొనసాగుతుంది
భారత్‌లో కెనడా ప్రధాని మెక్ కార్నీ పర్యటన కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కెనడాతో భారత్ కీలక ఒప్పందం చేసుకుంది.కెనడాతో రూ.24 వేల కోట్ల యురేనియం డీల్ కుదిరింది. ఇకపై భారత్‌కు యురేనియం కెనడా సప్లయ్ చేయనుంది. కీలక ఖనిజాల సరఫరాపై ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు చేవాయి.
యాభై బిలియన్ డాలర్ల లక్ష్యంగా...
అలాగే ఇద్దరి మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చనడిచింది. దీంతో పాటు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను కూడా ఇరు దేశాల అధినేతలు చర్చించుకున్నారు. 2030 కల్లా వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం యాభై బిలయన్ డాలర్లకు చేర్చే లక్ష్యంగా చర్చలు సాగయి. ఇందుకోసం భాగస్వామ్య ఒప్పందాన్ని కూడా ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి.